: సొంత ఖర్చులతో చెన్నై ఫిలిం ఫెస్టివల్ కు అమీర్ ఖాన్


ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతోన్న చెన్నై చలన చిత్రోత్సవానికి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సొంత ఖర్చులతో హాజరవుతున్నాడు. ముంబై నుంచి తమిళనాడు వరకు తనకు, తన అసిస్టెంటులకు అయ్యే ఖర్చులను అమీర్ తానే భరిస్తానన్నారని ఫెస్టివల్ నిర్వాహకురాలు, నటి సుహాసిని మణిరత్నం తెలిపారు. ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ చిత్రోత్సవాలను ఇండో సినీ అప్రిసియేషన్ తో తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత సంవత్సరం చెన్నై ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన అమితాబ్ బచ్చన్ కూడా సొంత ఖర్చులతోనే వచ్చారు. ఇప్పుడు బిగ్ బీ బాటనే అమీర్ అనుసరించడం విశేషం.

  • Loading...

More Telugu News