: మండేలా పూజ్యనీయుడు: ప్రణబ్ ముఖర్జీ
భారత దేశానికి సంబంధించినంతవరకు నెల్సన్ మండేలా పూజ్యనీయుడని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. సౌతాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ లో మండేలా సంతాప సభలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ మండేలా ఈ శతాబ్ధపు త్యాగధనుడు అంటూ కీర్తించారు. నెల్సన్ మండేలా మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మండేలా ఈ శతాబ్థపు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.
ప్రపంచ చరిత్రలో మండేలా తెలివైన నేత అని ప్రణబ్ వివరించారు. గాంధీ సత్యాగ్రహ విధానం వల్ల మండేలా స్ఫూర్తి పొందారని తెలిపిన ప్రణబ్, భారత్ సందర్శనకు వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉంటుందని చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రపంచం గొప్ప యోధుడ్ని కోల్పోయిందన్నారు. ప్రపంచ ప్రజల్లో మానవతా విలువల స్పూర్తి నింపిన నేత నెల్సన్ మండేలా అని ఆయన కొనియాడారు.