: రాజస్థాన్ సీఎంగా ఈ నెల 13న వసుంధర రాజె ప్రమాణ స్వీకారం


రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఈ నెల 13న వసుంధర రాజె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరికొందరు పార్టీ నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ మేరకు ఈ రోజు వసుంధర, కొంతమంది నేతలు ఆ రాష్ట్ర గవర్నర్ మార్గరెట్ అల్వాను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని గవర్నర్ కు తెలిపారు. అంతకుముందు పార్టీ శాసనసభ్యులు సమావేశమై వసుంధరను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ శాసనసభలో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో వసుంధర నేతృత్వంలోని బీజేపీ 162 స్థానాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

  • Loading...

More Telugu News