: కిరణ్, చంద్రబాబులపై కేసీఆర్ ఘాటైన విమర్శలు
రాజ్యాంగం పట్ల సీఎం కిరణ్ కు ఏమాత్రం అవగాహన లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అనర్హుడని అన్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా ఆయన ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని అన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం గౌరవం లేదని విమర్శించారు. తెలంగాణ టీడీపీ నేతలు ఇప్పటికైనా చంద్రబాబును వదిలిపెట్టాలని సూచించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణను ఆపలేరని అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.