: శాసనసభలో చర్చ మాత్రమే ఉంటుంది.. తీర్మానం ఉండదు: కేసీఆర్


చరిత్రలో ఎన్నో బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయని... తెలంగాణ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో చర్చ మాత్రమే ఉంటుందని... తీర్మానం ఉండదని తెలిపారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ ఏదీ సాధ్యం కాదని, అలాగే నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సాధారణ విషయాలే అని చెప్పారు. మన దేశంలో మొదట్లో 14 రాష్ట్రాలుండేవని, తర్వాత మరో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడి తీరుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News