: ఆ మూడు పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నిలిచేది కాదు: కేసీఆర్
రాష్ట్ర విభజన ఆపేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని... ఆ పార్టీలేవీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు తమ పద్దతిని మార్చుకోవాలని... పార్టీకి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తెలంగాణ టీడీపీ నాయకులు అదే పార్టీలో కొనసాగుతారో లేక బయటకు వస్తారో నిర్ణయించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో జగన్ పార్టీ ఇప్పటికే గల్లంతయిందని ఎద్దేవా చేశారు. మూడు పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నిలిచేది కాదని చెప్పారు. ఇంత దూరం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన ఆగే అవకాశమే లేదని అన్నారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఇప్పటికీ ప్రజలను మభ్యపెడుతూ, మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.