: 14 పేజీలతో ప్రధానికి కేసీఆర్ లేఖ


14 పేజీలతో కూడిన లేఖను ప్రధానమంత్రికి పంపుతున్నట్టు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఈ లేఖలో విభజన బిల్లులో చేయాల్సిన సవరణలను పొందుపరిచామని తెలిపారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఉన్నతోద్యోగులు కలసి దీన్ని రూపొందించారని తెలిపారు. హైకోర్టు విభజన, రాజ్యసభ సభ్యుల పంపకాలపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని... దీన్ని ప్రధాని దృష్టికి తీసుకెళుతున్నామని అన్నారు. అప్పులకు సంబంధించిన పంపిణీ విధానాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 1919లోనే నిజాం ముల్కీ నిబంధనలు వచ్చాయని... ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత కూడా వాటిని కొనసాగిస్తామన్నారని అన్నారు. 1985 లో 610 జీవో వచ్చిందని... అయినా ఇక్కడ అక్రమంగా నియమితులైన ఉద్యోగులను వెనక్కి పంపలేదని విమర్శించారు. వారంతా ఇక్కడే పదవీ విరమణ పొందారని చెప్పారు. నేటివిటీ ఆధారంగానే ఉద్యోగుల పించన్లను కేటాయించాలని... లేకపోతే తెలంగాణపై ఇది భారంగా పరిణమిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News