: పార్లమెంటులో జరిగిందే అసెంబ్లీలో కూడా జరుగుతుంది: ఆనం వివేకా


పార్లమెంటులో సొంత పార్టీపైనే అవిశ్వాసం పెట్టిన విధంగా, రాష్ట్ర శాసనసభలో కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఏకమై బిల్లును అడ్డుకుంటామని ఎమ్మెల్యే ఆనం వివేకా తెలిపారు. తమపై ఎన్ని ఆంక్షలు విధించినా తాము లెక్క చేయమని అన్నారు. ఈ విషయంలో సీఎం సహా కీలక నేతలందరూ ఒకే మాటపై ఉంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను లెక్క చేయకుండా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

  • Loading...

More Telugu News