: జేసీని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐసీసీకి లేఖ రాశాను: బొత్స
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై జేసీ దివాకర్ రెడ్డి నిన్న (సోమవారం) చేసిన సంచలన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పందించారు. జేసీ వ్యాఖ్యలు అహంకార పూరితమైనవన్నారు. జేసీని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐసీసీకి లేఖ రాసినట్లు చెప్పారు. కావాలనుకుంటే జేసీ వేరే పార్టీలోకి వెళ్లవచ్చని.. ఆయనను ఎవరూ కాళ్లు పట్టుకుని ఆపడంలేదని అన్నారు. సోనియాను విమర్శిస్తే పెద్ద వ్యక్తి అవుతామనుకుంటే అది పెద్ద పొరపాటన్నారు. సొంత పార్టీపై కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం పెట్టడం సమంజసం కాదని బొత్స పేర్కొన్నారు.