: ముంబైలో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ


దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని ముంబైపై దృష్టి సారించింది. యువతరం ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ, దేశానికి సరికొత్త మార్గాన్ని చూపుతూ, జీవనవ్యయాన్ని తగ్గించి.. అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ... ముంబై అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు ఏఏపీ నేత మయాంక్ గాంధీ తెలిపారు. ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు ఆయన వివరించారు.

లోక్ సభ స్థానాలపై ఇప్పటి వరకు పూర్తి నిర్ణయానికి రాకపోయినప్పటికీ, ముంబైలో ఉన్న ఆరు లోక్ సభ స్థానాల్లో పోటీపడాలనే తమ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మూస ధోరణితో అధికారం కోసం పాకులాడుతూ ఆస్తులు వెనకేసుకునే నేతలను వద్దని ప్రజలు కోరుకుంటున్నారని... కొత్త మార్గం చూపిస్తారనే ఆలోచనతోనే ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News