: పార్లమెంటు ఉభయ సభలు వాయిదా


ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంటు ఉభయసభలు గంట సేపు వాయిదా పడ్డాయి. లోక్ సభ, రాజ్యసభలు తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఇవాళ ఉదయం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన వెంటనే సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగిపోయాయి. ఈ క్రమంలో లోక్ సభలో టీడీపీ ఎంపీలు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనికి తోడు 2జీ స్కాంపై చర్చకు బీజేపీ శ్రేణులు పట్టుబట్టాయి. ఈ క్రమంలో లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను గంటసేపు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News