: మేరీ కామ్ తో బాక్సింగ్ చేసిన అమితాబ్!


'అన్ బ్రేకబుల్' పేరుతో ఒలింపిక్ బాక్సింగ్ చాంపియన్ మేరీకామ్ రాసిన ఆత్మకథ పుస్తకాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు. ముంబైలోని ఓ షాపింగ్ మాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మేరీకామ్ పై అమితాబ్ ప్రశంసల వర్షం కురిపించారు. మేరీ దిగ్గజ మహిళ అని, దేశంలో అందరూ తనను అభిమానిస్తున్నారన్నారు. బాక్సింగ్ లాంటి క్రీడల్లో మహిళలు రాణించలేరన్న మూసధోరణిని బద్దలు కొట్టారని ప్రశంసించారు. ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చి, ఆమె చూపిన తెగువ అందరికీ స్పూర్తినిస్తుందని బిగ్ బీ పేర్కొన్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ మేరీకామ్ ఆత్మకథ చదివి స్పూర్తి పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మేరీతో అమితాబ్ సరదాగా బాక్సింగ్ చేశారు.

  • Loading...

More Telugu News