: మిజోరాంలో మళ్లీ పాగా వేసిన కాంగ్రెస్


ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సగానికి పైగా సీట్లు దక్కించుకుంది. ప్రస్తుతం 22 చోట్ల విజయ ఢంకా మోగించి ఇంకా కొన్నిచోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో, ఇక్కడ మరోసారి కాంగ్రెసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మరోవైపు మిజోరాం డెమొక్రటిక్ అలయెన్స్ మూడు స్థానాల్లో గెలిచి, నాలుగు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కు మిజోరాం విజయం స్వల్ప ఊరటనిచ్చింది,

  • Loading...

More Telugu News