: సోనియాకు గుడి కడితే కూల్చేస్తామంటూ బీజేపీ నేతల ఆందోళన
మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామలో సోనియా గుడిని నిర్మించేందుకు మాజీ మంత్రి శంకర్రావు ఇవాళ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలో వందలాది మంది విద్యార్థుల చావుకు కారణమైన సోనియాగాంధీ ఆలయ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీని నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు తిరస్కరించారంటూ వారు గుర్తు చేశారు. ఆలయం నిర్మిస్తే కూల్చివేస్తామంటూ హెచ్చరించారు.