: సమైక్యాంధ్ర సాధనే మా ఏకైక లక్ష్యం: అశోక్ బాబు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది అసెంబ్లీకి వస్తే అడ్డుకుని తీరతామని అశోక్ బాబు స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభను ముట్టడించి సభా కార్యక్రమాలను స్తంభింపజేసేందుకు వెనుకాడేది లేదన్నారు. ఇవాళ సాయంత్రం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించమని ముఖ్యమంత్రి కిరణ్ ను కోరామని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సీఎం కిరణ్ అండగా ఉన్నారని అశోక్ బాబు అన్నారు.

  • Loading...

More Telugu News