: దేశవ్యాప్తంగా పోటీ చేస్తాం: ఆమ్ ఆద్మీ పార్టీ
వ్యవస్థను మార్చాలి, అవినీతిని చెరిపేయాలంటూ వచ్చి.. ఢిల్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే ఉత్సాహంతో రానున్న సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చే్యాలనుకుంటోంది. 2014 ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా తెలిపారు. ఎన్నికల పట్ల సామాన్యుడి నమ్మకాన్ని పునరుద్ధరించామని మరో నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు.