: విశాఖ, అనంతలో కొనసాగుతున్న ఆందోళనలు
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ, అనంతపురంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేజీహెచ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కళాశాలల విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రా యూనివర్సిటీలో పరీక్షలు వాయిదా పడ్డాయి. అనంతపురంలో సమైక్య వాదులు తెలుగుజాతి విద్రోహ దినాన్ని పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. 2009 నవంబర్ 9 నాటి కేంద్ర ప్రకటనకు నిరసనగా విద్రోహ దినాన్ని పాటించాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.