: సాలెగూడులో ఉండే మహత్తు మామూల్ది కాదు
ఉక్కుకంటె దృఢంగా ఉంటూ, అసాధారణమైన సాగే లక్షణం కలిగి ఉండే 'సాలెగూడు'.. ప్రకృతి మాత యొక్క అద్భుతమైన విషయాలలో ఒకటిగా చాలా కాలంగా గుర్తింపు పొందుతూనే ఉంది. ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు మరో కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. సాలెగూడే వేటాడే జీవివైపు వంగుతుందని అంటున్నారు. వాటి ఉపరితలం మీద ఎలక్ట్రికల్ కండక్టవిటీతో ఉండే జిగురు ఇలా చేస్తుందని వారు చెబుతున్నారు. సాలెగూటిలోని తీగలపై ఉండే జిగురు యొక్క ఎలక్ట్రికల్ లక్షణాలు.. అది కీటకాలను పట్టుకోవడానికి దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఓ సైన్సు మేగజైన్‌లో ప్రచురితమైన వ్యాసంలో చార్జి అయిన సాలెగూడు ఎలా గాలిలోని వాటిని కదిలి పట్టుకుంటుందో వివరించారు. గాలిలో ఉండే కాలుష్యకారకాలను కూడా ఆకర్షించి వాటి మోతాదును పసిగట్టడానికి ఈ సాలెగూడులను ఉపయోగించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.