: దక్షిణాఫ్రికా చేతిలో భారత్ కు మరో పరాభవం
మనవాళ్లు మరోసారి బొక్క బోర్లా పడ్డారు. డర్బన్ లో ఈ రోజు జరిగిన వండే క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది. 281 పరుగుల టార్గెట్టుతో బ్యాటింగుకి దిగిన భారత్ 146 పరుగులకే తోకముడిచేసింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్ మేన్ కకావికలయ్యారు. దీంతో మూడు వన్డేల సీరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా 2-0తో ఎగరేసుకుపోయింది. భారత జట్టులో రైనా 36, జడేజా 26, రోహిత్ శర్మ 19, ధోనీ 19 పరుగులు చేయగా, మిగిలిన ఆటగాళ్ళు ఇలా వచ్చి అలా చేతులెత్తేశారు.