: ధర్మవరపు సుబ్రహ్మణ్యం మృతి పట్ల వైఎస్ జగన్, భారతి సంతాపం
ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అకాల మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన తన జీవితాన్ని హాస్యానికి చిరునామాగా గడిపారని, తెలుగు ప్రజల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారని జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆయన కుటుంబానికి తన సంతాపాన్ని తెలిపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను వైఎస్ జగన్ సతీమణి, సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి పరామర్శించారు. అయన మృతి తెలుగు సినీపరిశ్రమతో పాటు, తెలుగు ప్రజానీకానికి తీరని లోటని ఆమె అన్నారు. వైఎస్ భారతి తో పాటు, వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.