: తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం.. ఐదుగురి పరిస్థితి విషమం
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో 20 మంది ఉపాధి హామీ కూలీలు గాయపడ్డారు. రాజవొమ్మంగి మండలం కిండ్ర ప్రాంతంలో మడేరు వాగుపై ఉన్న రోప్ వే తెగి కింద కాలువలో పడిపోయింది. దీంతో రోప్ వేలో వెళుతున్న 20 మంది ఉపాధి కూలీలు గాయాలపాలయ్యారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎక్కువ మంది కూలీలు రోప్ వేలో ఎక్కడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.