: శివరాజ్ సింగ్ చౌహాన్ హ్యాట్రిక్


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హ్యాట్రిక్ కొట్టారు. వెలువడుతున్న ఫలితాలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. దీంతో ఇప్పటికే రెండు సార్లు వరుసగా సీఎం పదవిని చేపట్టిన శివరాజ్ సింగ్, మరోసారి మఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ఇప్పటికే ఆయన నివాసం వద్ద బీజేపీ కార్యకర్తల కోలాహలం మొదలైంది. డప్పులు వాయిస్తూ, రంగులు చల్లుకుంటూ, డ్యాన్సులు చేస్తూ అభిమానులు సందడి చేస్తున్నారు. మరో వైపు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఆకాశానికెత్తేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ అధ్బుతమపైన ఫలితాలను సాధించారని పొగడ్తలతో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News