: ఛత్తీస్ గఢ్ లో విజయం దిశగా కాంగ్రెస్
మూడు రాష్ట్రాలలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్ గఢ్ లో మాత్రం నిలదొక్కుకుంది. వేరే చోట్ల ఓటమిపాలవగా.. ఛత్తీస్ గఢ్ లో మాత్రం విజయం దిశగా పయనిస్తోంది. ఈ రాష్ట్ర విధానసభలో మొత్తం 90 స్థానాలకుగాను కాంగ్రెస్ అత్యధికంగా 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంతో రెండో స్థానానికి పరిమితమవుతోంది. ఇతరులు మూడు స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు కావాల్సి ఉంటుంది. తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి కాంగ్రెస్ ఆ మార్కును చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు తక్కువైనా స్వతంత్ర అభ్యర్థుల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కు అవకాశాలు ఉన్నాయి.