: కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ బాధ్యుడు కాదు: రాజీవ్ శుక్లా
ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నేతలను కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే బాధ్యుడు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా అన్నారు. ఓటమికి రాహుల్ ను నిందించడం తగదని తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఓటమికి అందరూ సమష్టిగా బాధ్యత వహించాలని తెలిపారు.