: కేజ్రీవాల్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు: అన్నా హజారే


తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడంపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే హర్షం ప్రకటించారు. కేజ్రీవాల్ ఏదో ఒక రోజు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పనున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారనుందన్నారు.

అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని చీపురు కట్ట (ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు)తో ఊడ్చిపారేయడం అంత తేలికైన విషయం కాదని చెప్పారు. వేరే పార్టీల దగ్గర ఎంతో ధనం ఉందని.. వాటితో తలపడి కేజ్రీవాల్ పార్టీ 24 సీట్లను సాధించనుండడంపై సంతోషం ప్రకటించారు. అదే సమయంలో అవినీతికి దూరంగా ఉండాలంటే వేరే పార్టీతో జతకట్టరాదని కేజ్రీవాల్ కు అన్నా సూచించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి అన్నా హజారే గతంలో తిరస్కరించిన విషయం తెలిసిందే. అంతేకాదు, తన పేరును వాడుకున్నందుకు కూడా ఆయన లోగడ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News