: అవినీతి ప్రభుత్వాలను ఓటర్లు ఇంటికి పంపారు: టీఆర్ఎస్ నేత హరీష్ రావు
ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని... దానికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఆధిక్యతే రుజువని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. అవినీతి ప్రభుత్వాలను ప్రజలు ఇంటికి పంపారని అన్నారు. ఏఏపీ లేకపోతే ఢిల్లీలో కూడా బీజేపీ పూర్తి ఆధిక్యత సాధించి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఓ వార్తా చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజలు మార్పుకోరుకుంటున్నారనే విషయానికి సంకేతమని చెప్పారు.