: బిల్లు పాసయిన 45 రోజుల్లో కొత్త రాజధానిపై కమిటీ నివేదిక: జైరాం
అతి త్వరలోనే సీమాంధ్రకు కొత్త రాజధాని కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయిన 45 రోజుల్లో కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి? విధివిధానాలపై కమిటీ నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. అనంతరం సీమాంధ్ర రాజధానిలో సచివాలయం, రాజ్ భవన్, సెక్రటేరియెట్, కోర్టు తదితర భవనాల నిర్మాణానికి కేంద్రమే నిధులు సమకూరుస్తుందన్నారు.