: నేడు మారిషస్ పర్యటనకు వెళుతున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు మారిషస్ కు బయలుదేరి వెళుతున్నారు. మంగళవారం నిర్వహించే ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొంటారు. మొత్తం మూడు రోజుల పర్యటన కోసం వెళుతున్న రాష్ట్రపతి.. ప్రధానంగా మారిషస్ అధ్యక్షుడు రాజేకేశ్వర్ పుర్యాగ్ తో ద్వైపాక్షిక చర్చలు చేయనున్నారు.
అంతేకాక, ఆరోగ్యం, పర్యాటకం, సామాజిక రంగాలకు చెందిన పలు అంశాలపై భారత్ తో మారిషస్ ఒప్పందాలు చేసుకుంటుందని రాష్ట్రపతి మీడియా కార్యదర్శి న్యూఢిల్లీలో తెలిపా