: శంకర్రావు విషయంలో తప్పని తేలితే పోలీసులపై కఠినచర్యలే: డీజీపీ
మాజీ మంత్రి శంకర్రావు వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై సీఐడీ నివేదిక వచ్చిన తరువాతే చర్యలు ఉంటాయని డీజీపీ దినేశ్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో శంకర్రావు పట్ల ప్రవర్తించిన తీరులో పోలీసులది తప్పని తేలితే కఠిన చర్యలకు వెనుకాడబోమని చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన దినేశ్ రెడ్డి ఈ విషయం చెప్పారు. శంకర్రావు వ్యవహారంలో ఉన్నతస్థాయి విచారణ జరుపుతున్నామన్న డీజీపీ... అక్బరుద్దీన్, మిగతా కేసుల గురించి పోలీసులు చూసుకుంటారన్నారు.