: ఒక్క డాలరుకే కారు!


రండి బాబూ రండి... ఒక డాలరుకు ఒక కారు... అంటూ ఒక కార్ల కంపెనీ డీలరు అమ్మకాలు ప్రారంభించారు. ఈ ఒక డాలరు కారు కొనడానికి పెద్ద సంఖ్యలో జనాలు క్యూ కట్టారు. అయితే ఇందులో ఐదుగురిని మాత్రమే అదృష్టలక్ష్మి వరించింది. ఎందుకంటే సదరు కార్ల కంపెనీ డీలరు మాత్రం ఐదు కార్లను మాత్రమే ఒక డాలరుకు ఒకటి చొప్పున విక్రయిస్తామని చెప్పారు. దీంతో క్యూలో మిగిలినవారు ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు. అయితే ఆ ఐదుగురి అదృష్టవంతుల్లో ఇద్దరు తల్లీ కొడుకులే. అదీ అదృష్టమంటే!

అమెరికాలో థ్యాంక్స్‌ గివింగ్‌డే తర్వాత వచ్చే శుక్రవారాన్ని బ్లాక్‌ ఫ్రైడేగా పరిగణిస్తారు. ఆ రోజున షాపింగ్‌మాల్స్‌ అన్నీ కూడా డిస్కౌంట్ల ఆఫర్లతో మారుమోగిపోతాయి. త్వరలోనే రానున్న క్రిస్మస్‌ వేడుకలకు సంబంధించిన కొనుగోళ్లు ఆ రోజునుండే ప్రారంభమవుతాయి. ఈ బ్లాక్‌ఫ్రైడే రోజున హోస్టన్‌లోని ఒక కార్ల డీలరు 300లకు 'స్టెర్లింగ్‌ మెక్‌కాల్‌ టొయోటా' కార్లపై డిస్కౌంట్‌ ప్రకటించారు. అందులో ఐదు కార్లను ఒక్కొక్కటీ ఒక్క డాలర్‌కే విక్రయిస్తామని ప్రకటించారు. దీంతో ఒక్క డాలరు కారును సొంతం చేసుకోవడానికి వందలమంది క్యూ కట్టారు. అంత క్యూలో ఒకటి రెజినాల్ట్‌ అనోక్వురు అనే పదిహేనేళ్ల కుర్రాడికి దక్కింది. మరొకటి రెజినాల్ట్‌ తల్లికి వచ్చింది. దీంతో క్యూలో మిగిలినవారు తల్లీ కొడుకుల అదృష్టాన్ని చూసి గోలచేశారు. గంటలతరబడీ మేం క్యూలో ఉన్నాం... కానీ మా స్థానాన్ని మరొకరు ఆక్రమించారు అంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. షాప్‌ నిర్వాహకులు మాత్రం నిరాశతో వెనుదిరిగిన కస్టమర్లకు బెటర్‌లక్‌ నెక్ట్స్‌టైమ్‌ అని చెప్పి పంపించారు.

  • Loading...

More Telugu News