: రంగంలోకి దిగిన సమైక్యాంధ్ర 'స్టార్ బాట్స్ మేన్'!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థి దశలో మంచి క్రికెటర్ అన్న విషయం విదితమే. బ్యాటింగ్ పై ఆయనకు మంచి పట్టుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న కిరణ్ ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆయన అధిష్ఠానంపై నిప్పులు కురిపించారు. పులిచింతల ప్రాజెక్టు విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
విభజన ఏర్పాటు నిర్ణయం వెలువడిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజల ఆవేదనను అధిష్ఠాన పెద్దలు అర్థం చేసుకోలేదన్నారు. రాష్ట్ర విభజన జడి వానలో రంగంలోకి దిగిన ఈ సమైక్యాంధ్ర 'స్టార్ బాట్స్ మేన్' విమర్శలనే బంతులను ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేతలపైకి కొట్టడం ప్రారంభించారు. ముఖ్యమంత్రే విమర్శలను చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనను అధికారంలో కొనసాగనిస్తారా? లేదా? ఈ విషయంలో ఆ పార్టీ అధినేత్రి ఎలా స్పందిస్తుందోనన్నది వేచి చూడాల్సిందే.