: ‘మడి’ తుపాను ప్రభావంతో ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ‘మడి’ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చెన్నైకు ఆగ్నేయ దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల్లో ఇది పెను తుపానుగా మారే అవకాశం ఉందని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచించారు.