: యెమెన్ ఉగ్రవాదుల దాడిలో యాభై మంది మృతి
యెమెన్ మిలటరీ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. హెడ్ క్వార్టర్స్ లోకి చొరబడి కారుబాంబు పేల్చారు. ఈ దాడిలో సుమారు 50 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో భారత్ కు చెందిన ఓ నర్సుతో పాటు మరికొంత మంది విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. తీవ్రవాదులపై ఇటీవల అమెరికా సైన్యం డ్రోన్ దాడులకు పాల్పడుతున్నందుకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు అల్ ఖైదా ప్రకటించింది.