: సుబ్బరాయన్ తో సంబంధాల్లేవ్ : ఏపీఎన్జీవోలు
తమపై విమర్శల వర్షం కురిపిస్తున్న సుబ్బరాయన్ తో తమకెలాంటి సంబంధాల్లేవని ఏపీఎన్జీవోలు తేల్చి చెప్పారు. అశోక్ బాబుపై ఏపీఎన్జీవో సంఘం మాజీ నేత సుబ్బరాయన్ చేసిన విమర్శలను వారు ఖండించారు. అయినా.. తాము చేస్తున్న కార్యకలాపాలపై ఆయన అభిప్రాయాలను, సద్విమర్శలను స్వీకరిస్తామన్నారు. అంతేగాని నేరుగా మీడియాలో తమపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని వారు హితవు పలికారు.