: మీరు చెబితే వింటానా?.. మీరెవరు చెప్పడానికి?: కావూరి ప్రశ్న
ఢిల్లీలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పత్రిఆ సమావేశం చివర్లో మీడియాపై రుసరుసలాడారు.. ప్రజలు ప్రశ్నించే పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన మీడియాను.. మీరడిగితే చెప్పాలా? అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఎవరి అభిప్రాయాలు వారు చెబుతారని, రాజీనామాలు చేసినా ఉపయోగం లేదని, అయినా రాజీనామాలు మీరు అడగడమేంటని మంత్రి అన్నారు. మీరేమన్నా ప్రజాప్రతినిధులా? అని నిలదీశారు.
మీరు కేవలం మేం చెప్పేది ప్రజలకు చేరవేయడానికి మాత్రమే ఉన్నారని, అందుకే తాను మీతో ఈ విషయాలన్నీ పంచుకున్నానని అన్నారు. అంతవరకూ తాను చెప్పాలనుకున్నది చెప్పి ఒక్కసారిగా ఇలా మారిపోయిన కేంద్ర మంత్రిని చూసి మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. తనకు ప్రజల్లోకి వెళ్లడానికి భయంలేదని.. తాను ప్రజల్లోకి వెళ్తానని.. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉందనీ, అంతవరకు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని.. ఇప్పటి సమీకరణాలన్నీ అప్పటికి మారిపోతాయని ఆయన చెప్పారు.