: అసెంభ్లీ సమావేశాలు 30 రోజులు నిర్వహించండి: రాఘవులు
త్వరలో ప్రారంభం కానున్నరాష్ట్ర అసెంభ్లీ సమావేశాలను 30 రోజుల పాటు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోరారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. నెల రోజులు పాటు సమావేశాలు నిర్వహించడం వల్ల రాష్ట్రంలోని అనేక ప్రజా సమస్యలపై చర్చించడానికి వీలవుతుందని రాఘవులు లేఖలో పేర్కొన్నారు.