: తెలంగాణ ఏర్పాటును అడ్డుకోకుండా రధయాత్ర చేస్తా: వీహెచ్
తెలంగాణ ప్రజల కల సాకారమవుతున్న వేళ సమైక్యాంధ్ర అంటూ అడ్డు తగులుతున్న వారిపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఎదురు దాడి చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోకుండా రధయాత్ర నిర్వహించి చైతన్యపరుస్తానని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో చెప్పారు. సీమాంద్ర నేతలు ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. జగన్ పర్యటన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాదని, అక్రమ ఆస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకేనని వీహెచ్ ఆరోపించారు. తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాలను తమ పార్టీ దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.