: భారత పేసర్లలో పస లేదు: డికాక్
భారత పేస్ బౌలింగ్ లో పస లేదని సౌతాఫ్రికా యువ కెరటం డికాక్ అంటున్నాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన డికాక్ డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ లతో భారత బౌలర్లను పోల్చలేమని అభిప్రాయపడ్డాడు. టీమిండియా బౌలర్లు కనీసం వారి దరిదాపులకు కూడా చేరలేరన్నాడు. స్టెయిన్, మోర్కెల్ లు 145 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసరగలరన్న డికాక్, భారత బౌలర్లు అంత వేగాన్ని అందుకోలేరని చెప్పాడు. అంత వేగంతో నిలకడగా బంతులు వేయగలిగితే కానీ తమను భారత బౌలింగ్ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశాడు. తాము స్టెయిన్, మోర్కెల్ లాంటి ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లతో సాధన చేస్తున్నామని గుర్తు చేశాడు. రానున్న వన్డేల్లో భారత బౌలింగ్ కు కఠిన పరీక్ష ఎదురుకానుందని డికాక్ స్పష్టం చేశాడు.