: బెంగళూరు ఏటీఎం దాడి కేసులో అనుమానితుడు అరెస్ట్


బెంగూళూరు ఏటీఎంలో మహిళపై దాడి కేసులో అనుమానితుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఇరవై రోజుల దర్యాప్తు అనంతరం కర్ణాటకలోని తూముకూరులో నిందితుడిని అరెస్ట్ చేశారు. గతనెల బెంగళూరులోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ మహిళపై అనుమానితుడు తీవ్ర దాడికి పాల్పడ్డాడు. మహిళ తలపై పలుమార్లు దాడి చేసి ఆమె సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఈ దృశ్యాలు ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అనంతరం ఏటీఎంలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె తలకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే, బాధితురాలికి కుడివైపు పక్షవాతం వచ్చిందని, ప్రస్తుతం తమ పర్యవేక్షణలోనే చికిత్స పొందుతూ కోలుకుంటోంది వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News