: నెలకు ఒకసారి ఈ మందు తీసుకుంటే చాలు


మతిమరుపు జబ్బు అల్జీమర్స్‌కు అనుదినం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా నెలకు ఒకసారి మందు తీసుకుంటే చాలు. ఈ జబ్బును ముదరకుండా అదుపు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి ఒక సరికొత్త మందును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు స్వల్ప మతిమరుపు (మైల్డ్‌ డిమెన్షియా) బాధితుల కొరకు తయారుచేసిన సోలామెజుమాబ్‌ అనే మందు మెరుగైన ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. ఈ మందును ఉపయోగించిన వారి రోజువారీ ప్రవర్తనతోబాటు వారి మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి విషయంలోనూ కూడా ఇది ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మందు డిమెన్షియా నివారణలో గొప్ప ముందుడుగు కాగలదని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ మందుపై తర్వాత జరిపే పరీక్షలు విజయవంతమైతే డిమెన్షియా ముప్పుగలవారికి అల్జీమర్స్‌ లక్షణాలు కనపడడానికి పదేళ్లకు ముందే ఈ మందును నెలకు ఒకసారి సూదిమందు రూపంలో ఇవ్వవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో అల్జీమర్స్‌ జబ్బు ముదరకుండా నెలకు ఒకసారి తీసుకునేలా ఈ సూదిమందును అందుబాటులోకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News