: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా వెల్లడి
అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం పీసీసీ చీఫ్ బొత్స తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్ కుమార్, వీరభద్రస్వామి, లక్ష్మీశివకుమారి బరిలో దిగుతారని తెలిపారు.
కాగా ఆరో అభ్యర్ధిని రేపు ప్రకటిస్తామని బొత్స చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా, అన్నిప్రాంతాలను పరిగణనలోకి తీసుకునే.. అభ్యర్ధులను ఎంపిక చేశామన్నారు. ఎవరైనా అవిశ్వాసం పెట్టదలుచుకుంటే అసెంబ్లీలో తమ సత్తా చూపిస్తామని బొత్స ధీమా వ్యక్తం చేశారు.