: బాబు నమ్మకాన్ని వమ్ము చేయను: శమంతకమణి
సామాజిక న్యాయం పాటిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి.. మహిళా నేత శమంతకమణి ధన్యవాదాలు తెలిపారు. బాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని తెలిపారు. తన నియోజకవర్గాన్నే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని ఆమె చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమె టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కాగా, మరో అభ్యర్ధి సలీం మాట్లాడుతూ, మైనార్టీలను ఆదరించింది టీడీపీయేనని చెప్పారు. పేదలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.