: మండేలా నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటారు: ట్విట్టర్ లో సచిన్
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఎప్పటికీ తన హృదయంలో నిలిచి ఉంటారని పేర్కొన్నాడు. మానవత్వానికి నిజమైన ప్రేరణ మండేలా అని కొనియాడాడు. మండేలాను కలవటం తన జీవితంలో అత్యంత గుర్తుంచుకోదగ్గ విషయమని అభిప్రాయపడ్డాడు.