: అత్యాచారం కేసులో భారతీయ క్యాబ్ డ్రైవర్ కు ఆస్ట్రేలియాలో ఆరేళ్ల జైలు శిక్ష


టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముప్పై సంవత్సరాల నితిన్ రాణా అనే క్యాబ్ డ్రైవర్ కు ఆస్ట్రేలియాలో ఆరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని కంట్రీ కోర్టు జడ్జ్ వెండీ విల్ మాత్ మాట్లాడుతూ.. మత్తులో ఉండి, క్యాబ్ లో సరిగా కూర్చోలేని స్థితిలో ఉన్న పదిహేడేళ్ల టీనేజ్ బాలికపై నిందితుడు మూడుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఓ రోజు పాఠశాల నుంచి తిరిగివస్తున్న బాలిక మత్తులో ఉండి ఇంటికి వెళ్లేందుకు రాణా క్యాబ్ ను ఆశ్రయించింది. అప్పుడు ఆమె పరిస్థితిని గమనించిన డ్రైవర్ ఓ గ్యాంగ్ కు యాభై డాలర్లు ఇచ్చి బాలికను తన ఇంటికి తీసుకురావాలని చెప్పాడు. అలా ఆమెపై దారుణ అకృత్యానికి పాల్పడినట్లు జడ్జి తన తీర్పులో వివరంగా వెల్లడించారు. ప్రజలెప్పుడూ టాక్సీలు చాలా సురక్షితమైనవిగా భావిస్తారనీ, తమ టీనేజ్ పిల్లలకు కూడా ట్యాక్సీలు భద్రతగా ఉంటాయని భావిస్తారని జడ్జి వ్యాఖ్యానించారు. కానీ, అలా వచ్చిన బాలిక పట్ల డ్రైవర్ ఇలా ప్రవర్తించడం సహించలేనిదని అన్నారు.

  • Loading...

More Telugu News