: ప్రపంచంలో ఎవరూ జరుపుకోనంత పండగ చేసుకుంటాం: కేసీఆర్
తన ఉద్యమం అద్భుతంగా విజయవంతమైందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తేకుంటే తనను రాళ్లతో కొట్టి చంపమని 2001లోనే చెప్పానని కేసీఆర్ అన్నారు. ముసాయిదా బిల్లు పూర్తిగా ఆమోదం పొందిన తరువాతే సంబరాలు చేసుకుంటామన్న ఆయన, ఉభయసభల్లో బిల్లు పాసైన వెంటనే ప్రపంచంలో ఎవరూ జరుపుకోలేని సంబరాలు చేసుకుంటామని తెలిపారు.