: ఏ ఒక్క పార్టీ వల్లో తెలంగాణ రాలేదు: మోత్కుపల్లి, ఎర్రబెల్లి
సీమాంధ్రకు న్యాయం జరిగేలా కేంద్రం వెంటనే చర్యలను చేపట్టాలని టీడీపీ తెలంగాణ ప్రాంత నేతలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత సోనియా కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వెంటనే పెట్టాలని కోరారు. తెలంగాణ ఏ ఒక్క పార్టీ వల్లో రాలేదని అన్నారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారు. వీరి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం, ఉద్యోగం, పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. ఈ రోజు వారు తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.