: ఉత్తరాంధ్ర, రాయలసీమ పూర్తి నిర్లక్ష్యమయ్యాయి: సీపీఎం
ఉత్తరాంధ్ర, రాయలసీమలపై పాలకులంతా నిర్లక్ష్యం వహించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సింది పోయి.. రాష్ట్రాన్ని విభజించారని ఆయన మండిపడ్డారు. త్వరలో తాము వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఆందోళన చేపడతామన్నారు. తెలంగాణ బిల్లు అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, విద్యుత్ చార్జీల పెంపుదలపై ఆందోళన చేపట్టనున్నామన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు గెజిట్ కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తీర్పు పునఃసమీక్షించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రాఘవులు డిమాండ్ చేశారు.