: మండేలా వ్యక్తిగత జీవితంలో అన్నీ విషాదాలే


నెల్సన్ మండేలా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాద ఘట్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన వ్యక్తి. మండేలా మూడు వివాహాలు చేసుకున్నారు. ఇద్దరితో విడిపోయారు. 1947లో మండేలా, ఎవెలిన్ నోకోమాసేకు జన్మించిన చిన్నారి మకాజివే తొమ్మిది నెలలకే కన్నుమూసింది. మండేలాను కలిచివేసిన తొలి ఘటన ఇది. ఈ దంపతుల పెద్ద కొడుకు మాదిబ తెంబెకిలే 1969లో కారు ప్రమాదంలో మరణించారు. అప్పుడు మండేలా జైల్లో ఉన్నారు. అంతిమ క్రియలకు కూడా నోచుకోలేకపోయారు.

అంతకుముందు ఏడాదే మండేలా తన తల్లిని కోల్పోయారు. ఆమె అంత్యక్రియలకు వెళ్లడానికి కూడా జైలు అధికారులు అనుమతివ్వలేదు. మండేలా, ఎవెలిన్ దంపతుల మరో కుమారుడు మక్ గాతో లెవానికా మండేలా ఎయిడ్స్ కారణంగా 2005లో కన్నుమూశారు. చివరికి 2010లో మండేలా తన గారాల మనవరాలు 13ఏళ్ల జెనానీ మండేలాను కూడా కారు ప్రమాదంలో కోల్పోయారు. చెప్పలేనంత బాధను అనుభవించారు.

1958లోనే ఎవెలిన్, మండేలా విడిపోయారు. దాంతో మండేలా 1958లో విన్నీ మండికి జెలాను పెళ్లాడారు. 1990లో మండేలా జైలు నిర్బంధం నుంచి విముక్తుడైన రెండేళ్లకు 1992లో విన్నీతోనూ విడివడ్డారు. 1996లో వీరు విడాకులు తీసుకున్నారు. 1998లో గ్రాకామాచెల్ ను మండేలా చివరిగా పెళ్లాడారు. మాచెల్ మొజాంబికా దివంగత అధ్యక్షుడు సమోరా మాచెల్ భార్య. 1986లో సమోరా మరణించడంతో.. మాచెల్ మండేలాను భర్తగా స్వీకరించారు.

  • Loading...

More Telugu News