: ఈ నేతలు ఆ రెంటికి తప్ప మరెందుకూ పనికి రారు: హరికృష్ణ
అసమర్థ నేతలను కన్నందువల్లే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం దాపురించిందని మండిపడ్డ టీడీపీ నేత హరికృష్ణ ఈ రాజకీయ నాయకులు కుటుంబాలను తార్చడానికి, రాష్ట్రాన్ని అమ్ముకోడానికి తప్ప ఇంకెందుకూ పనికిరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం రాష్ట్ర రాజకీయ నాయకుల అసమర్థత వల్ల వచ్చిందని అభిప్రాయపడ్డ హరికృష్ణ టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు సంపూర్ణమద్దతు పలికారు.