: లోక్ సభ సోమవారానికి వాయిదా


లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లసూరీడు నెల్సన్ మండేలా మృతికి సభలో సభ్యులు సంతాపం తెలిపారు. పలువురు సభ్యులు మండేలా గొప్పదనాన్ని కొనియాడారు. ఆయన పోరాట స్మృతులను గుర్తు చేసుకొన్నారు. జాతి వివక్షపై మండేలా జైలు నుంచే పోరాటం చేశారని, భారతరత్నతో ఆయనను భారత్ గౌరవించిందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. అలాగే లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, ములాయం సింగ్, సోనియాగాంధీ తదితరులు మండేలా మరణంపై సభలో ప్రసంగించారు. అనంతరం స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News